Mithali Raj Announced Retirement From T20 Internationals || Oneindia Telugu

2019-09-03 683

Mithali Raj has announced retirement from T20 Internationals. She led India in 32 T20Is India including 3 Women's T20 World Cups in 2012 (Sri Lanka), 2014 (Bangladesh) and 2016 (India).Mithali Raj was captain when India played their first ever women's T20 International in Derby in 2006. In 89 T20 Internationals, Mithali scored 2364 runs including 17 fifties with a career-best 97 not out.
#mithaliraj
#retirement
#t20internationals
#Worldcup
#bcci
#womenscricketteam

భారత మహిళా జట్టు సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. వారం రోజుల క్రితం దక్షిణాఫ్రికాతో జరుగనున్న టీ20 సిరీస్‌కు అందుబాటులో ఉంటానని ప్రకటించిన మిథాలీ.. జట్టును ప్రకటించడానికి ముందుగానే టీ20ల నుంచి రిటైర్మెంట్‌ తీసుకున్నారు.భారత టీ20 జట్టుకు తొలి కెప్టెన్‌గా 2006లో బాధ్యతలు స్వీకరించిన మిథాలీ.. ఇప్పటివరకు 89 మ్యాచ్‌లు ఆడారు. ఇందులో 32 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించారు. మూడు టీ20 ప్రపంచకప్‌ (2012, 14, 16)లకు కెప్టెన్‌గా ఉన్నారు. 2364 పరుగులతో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రీడాకారిణిగా మిథాలీ నిలిచారు.